Naredco Team Meet Deputy CM Bhatti Vikramarka: పెండింగులో ఉన్న ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులేజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి నరెడ్కో తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం ఉపముఖ్యమంత్రిని కలిసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి ఆదాయాన్ని అందించే వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టమని ఉపముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
How to Check TS LRS Application Status 2023: తెలంగాణ LRS అప్లికేషన్ స్టేటస్.. ఇలా తెలుసుకోండి!
Bhatti Vikramarka on LRS Applications: స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు. థేమ్స్ నది తరహాలో మూసీ పరీవాహకం అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందని ఉపముఖ్యమంత్రి(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. ధరణిపై సూచనలు, సలహాలను ఇస్తే కమిటీకి పంపించి పరిశీలిస్తామని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులకు 10 శాతం మార్ట్గేజ్ విధానాన్ని ఎత్తి వేయాలని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, జీఓ 50ని ఎత్తివేయాలని నరెడ్కో బృందం ఉపముఖ్యమంత్రికి సూచించింది.