Nandikotkur MLA Arthur met with YSRCP workers:దళిత నేతలు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో వారి అభిప్రాయాలకు, వారి పనితీరుకు ఎలాంటి సంబంధం లేకుండా టికెట్ కేటాయింపులు, తొలగింపులు జరుగుతున్నాయి. తొలగింపు విషయంలో కార్యకర్తలు, స్థానిక నేతల అభిప్రాయాల్ని సైతం లెక్క చేయడం లేదు. వైఎస్సార్సీపీ పెద్దలకు నచ్చిన వారిని, లేదా ఆ జిల్లాల్లో పెత్తనం చేస్తున్న నేతల నిర్ణయాలు మాత్రమే అంతిమంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ టికెట్ విషయంలో సైతం వైఎస్సార్సీపీ పెద్దల నిర్ణయంతో నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇంఛార్జ్‌గా సుధీర్ నియామకంపై నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.
కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆర్థర్ సమావేశం: నంద్యాల జిల్లా నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కర్నూలులోని ఓ హోటల్లో భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్సీపీ అధిష్టానం డాక్టర్ సుదీర్‌ను ఇన్చార్జిగా నియమించింది. దీంతో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. అధిష్టానానికి మనం అవసరం లేనప్పుడు మనం కూడా ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని కార్యకర్తలు ఎమ్మెల్యేకు సూచించారు. భవిష్యత్తు కార్యచరణపై ఎమ్మెల్యే త్వరగా నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు ఎమ్మెల్యేను కోరారు. రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఎమ్మెల్యే మీడియా సమావేశంలో తెలిపారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండాలని అధిష్టానం కోరడంతో తాను అంగీకరించనందుకే టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు.
విధ్వంసం, నాశనం చెయ్యడం తప్ప మార్పు తీసుకురావడం సీఎం జగన్‌కు తెలుసా?: ఎమ్మెల్యే అనగాని