TTD Chairman BR Naidu on Corruption in TTD During YSRCP Rule: కూటమి ప్రభుత్వ పాలనలో ఏర్పడిన టీటీడీ ధర్మకర్తల మండలి తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. అతి తక్కువ సమయంలోనే సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. తొలి ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
తొలి ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. గత ప్రభుత్వంలో టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయని దానికి సంబంధించిన అవినీతిపరులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. గత పాలక మండలి ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుందని అవసరం లేకుండానే టీటీడీ నిధులు దుర్వినియోగం చేసి నిర్మాణాలు చేశారని తెలిపారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గు తేలుస్తామని అన్నారు. నాణ్యమైన సరకులతోనే భక్తులకు శ్రీవారి ప్రసాదం అందిస్తున్నామని అవినీతికి తావు లేకుండా నిబద్ధతతో పని చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
తొలి ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము. గత పాలక మండలి ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అవసరం లేకుండానే నిధులు దుర్వినియోగం చేసి నిర్మాణాలు చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గు తేలుస్తామ. శ్రీవాణి ట్రస్టులో జరిగిన అవకతవకలపై విచారణకు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అవినీతిపరులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు.- బీఆర్ నాయుడు, టీటీడీ ఛైర్మన్
సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం - ఇకనుంచి ఆకస్మిక తనిఖీలు: చంద్రబాబు