ED Case on Formula E Car Race : తెలంగాణలోని ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఏసీబీకి లేఖ రాసిన ఈడీ అధికారులు తాజాగా ఈ కేసు నమోదు చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ కేసు నమోదయ్యింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేశారు.
Formula E Car Race Case Updates : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది.
ఈ కార్ రేసు కేసు - హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ
ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో రంగంలోకి ఈడీ - వివరాలివ్వాలని ఏసీబీకి లేఖ
'జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతా' - మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు