YSRCP MLC Duvvada Case : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం టెక్కలి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంపై అసభ్య వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్ ఛార్జి కణితి కిరణ్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణకు రావాలంటూ ఈనెల 14న ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు జారీ చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో కలిసి ఇవాళ పోలీసుల విచారణకు హాజరయ్యారు. పవన్‌పై ఎందుకలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు అని పోలీసులు ప్రశ్నించారు. ఫిల్మీ లుక్స్ ఛానల్లో అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టడం, ట్రోల్స్ చేయడంపైనా దువ్వాడను ప్రశ్నించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రెండేళ్ల నాటి వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు పెట్టి స్టేషన్‌కు రప్పించారంటూ దువ్వాడ ఆరోపించారు.
డిప్యూటీ సీఎం పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు - ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్సీపీ దిద్దుబాటు చర్యలు - దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు - major changes in ysrcp
కుటుంబ కలహాలతో హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - Duvvada Approached to High Court