Police Investigation On YS Viveka PA Private Complaint : వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో వేసిన ప్రైవేట్ కంప్లైంట్‌పై పోలీసుల విచారణ జరిగింది. ఉదయం వైఎస్ మనోహర్ రెడ్డి, వేంపల్లి జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వీరిద్దరిని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ వేర్వేరుగా ప్రశ్నించారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా గతేడాది డిసెంబర్‌లో వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ SP రామ్ సింగ్ పైన పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్ కోర్టులో వేసేందుకు పోలీసులు తుది విచారణ చేపట్టారు. ఇటీవలే ఈ కేసులో ఏడుగురిని విచారించి వాంగ్మూలం తీసుకున్న డీఎస్పీ ఇవాళ మనోహర్ రెడ్డి, రవికుమార్ రెడ్డిని విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.
YS Viveka Murder Case Updates : ప్రభుత్వ ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి ఒకప్పటి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ ముమ్మరం చేశారు. విచారణకు రావాలంటూ గతంలోనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డితో పాటు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బాబాయ్ వైఎస్ మనోహర్‌రెడ్డి, తమ్ముడు అభిషేక్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అలాగే వైఎస్సార్ ట్రస్ట్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వీరే కాకుండా మరో ఐదుగురు సాక్షులకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు - తిరిగి ప్రారంభమైన విచారణ
అలాగే గత ఏడాది డిసెంబర్ 15న కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసుపై మళ్లీ విచారణ చేస్తున్న పోలీసులు కొద్ది రోజుల కిందట పీఏ కృష్ణారెడ్డిని ఈ కేసు అంశంపై డీఎస్పీ మురళీనాయక్ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. తాజాగా వైఎస్ మనోహర్ రెడ్డి, వేంపల్లి ZPTC సభ్యుడు రవికుమార్ రెడ్డిలను విచారించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా హత్య కేసులో కదలిక - ప్రభుత్వ ఆదేశాలతో పోలీసుల విచారణ
తాడేపల్లి ఇంట్లో జగన్ - అసెంబ్లీకి సునీత - ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం?!