MP Raghunandan Rao On CM Revanth :సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎఫ్-1 రేస్ కార్లకు ఎలాంటి జీవో లేకుండా కేటీఆర్ చెబితే రూ.50 కోట్ల ఇచ్చామని హెచ్ఎండీఏ గ్రోత్ కమిషనర్ అర్వింద్ కుమార్ చెప్పి ఆరు నెలలవుతున్నా కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ రెడ్డి కేటీఆర్‌తో అమెరికాలో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారేమో తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. సంగారెడ్డిలో హర్‌ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై పలు విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తోడు దొంగలు :కాంగ్రెస్, బీఆర్ఎస్లు మొదటి నుంచి తోడుదొంగల పార్టీలు అని రఘనందన్‌రావు విమర్శించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మబొరుసు లాంటివని అభివర్ణించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్మీట్లతో సరిపెడుతున్నాయి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
రేవంత్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు :తప్పు చేసిన వాడు కొడుకైనా, కుమార్తైనా శిక్షించడానికి వెనుకాడనని ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారని కానీ ఆయన మనసు ఒప్పలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉందన్నారు.