వైఎస్సార్సీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా - జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం - ఎంపీ రఘు రామ కృష్ణంరాజు
MP Raghu Rama Krishnam Raju Resigned: వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కి పంపారు. ఈ లేఖలో ఆయన జగన్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
![వైఎస్సార్సీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా - జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం MP Raghu Rama Krishnam Raju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-02-2024/1200-675-20830496-thumbnail-16x9-rrr.jpg)
Published : Feb 24, 2024, 2:50 PM IST
MP Raghu Rama Krishnam Raju Resigned :వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపారు. ఈ లేఖలో ఆయన జగన్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి తనను అనర్హుడిగా చేయడానికి వైఎస్సార్సీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని రాలేదని, ఇప్పుడు పార్టీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని తెలిపారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైందని, నరసాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని లేఖలో పేర్కొన్నారు.