MP Laxman Slams on Congress and BRS: కాంగ్రెస్ పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హస్తం పార్టీ మరోసారి మోసం చేయాలని చూస్తోందని వ్యాఖ్యలు చేశారు. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు నమ్ముతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.
MP Laxman Latest Comments on Revanth Reddy : కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హస్తం పార్టీకి ఎందుకు ఓటు వేయాలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిని వెలికితీస్తామని సీఎం చెప్పారని దీనికి సరైన సమాధానం చెప్పాలని నిలదీశారు. ధరణి పోర్టల్ అన్యాయాన్ని వెలికితీస్తానన్నారని, అ విషయం ఏమైందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్‌లా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారిలో ఒక్కరినైనా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని అడిగారు.
తెలంగాణలో 10 పార్లమెంట్ సీట్లు 35% ఓట్లతో ఘన విజయం సాధిస్తాం : లక్ష్మణ్
"సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశాం. గెలిచిన తరవాత వంద రోజుల్లో అద్భుతాలు చేస్తాం. పదేళ్ల పాలన ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుందని మోదీ చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తాం. వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారు."- లక్ష్మణ్, బీజేపీ ఎంపీ