MLC Kodandaram Oath Ceremony Delay :ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకరణకు శాసన మండలిలో నిరాశ ఎదురైంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి తాను సహచర ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌లు(MLC Ameer Ali Khan) శాసన మండలిలో వేచి చూశామన్న కోదండరాం, తాము మండలి చైర్మన్‌కు సమాచారం ఇవ్వకుండా వచ్చినట్లు వెల్లడించారు.
'నాకు ఎమ్మెల్సీ ఇవ్వటం ఉద్యమకారులకు ఇచ్చిన గుర్తింపు - బీఆర్ఎస్ నేతల అసహనం అర్థం కావడం లేదు'
అదేవిధంగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదని కార్యాలయం సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్న కోదండరాం, ఆయన మండలికి వస్తారేమోనని వేచి చూశామన్నారు. ఛైర్మన్ తమకు ఫోన్‌లో టచ్‌లోకి రాలేదని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకరణ విషయమై మండలి ఛైర్మన్‌కు(Council Chairman) సమాచారం పంపించాలని సెక్రటరీకి కోరినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 30 ఉదయం 09:30 గంటలకు ఇరువురు ప్రమాణ స్వీకారానికి మండలి ఛైర్మన్ అవకాశం ఇవ్వాలని కోరారు.
MLC Kodandaram Counter to Opposition Parties : ప్రతిపక్షాలు తన ఎమ్మెల్సీ ఎంపికపై చేస్తోన్న విమర్శలకు కోదండరాం స్పందించారు. తెలంగాణ సమాజానికి తాను చేసిన సేవ ఏంటనేది ప్రజలకు బాగా తెలుసునని, తన ఎంపికపై అనవసరంగా వివాదం చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగంలో షరతులు అర్థమైతే చర్చ ఉండదని, జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదానికి ఆస్కారం లేదన్నారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన నేను, అమీర్ అలీఖాన్ ఇద్దరం కూడా ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ రావడంతో ప్రమాణ స్వీకారం చేద్దామని శాసన మండలికి వచ్చాము. ఉదయం 11:30 గంటల నుంచి మండలి ఛైర్మన్ కోసం వేచి చూశాం. కానీ ఆయన ఆరోగ్యం బాగాలేక రాలేదు. అయినా ప్రమాణ స్వీకార విషయమై మేము ముందుగా ఎటువంటి సమాచారం ఆయనకు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకరణకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం.-కోదండరాం, ఎమ్మెల్సీ
శాసన మండలిలో కొత్త ఎమ్మెల్సీలకు నిరాశ - ప్రమాణం స్వీకారం రేపే! గవర్నర్ కోటాలో ఇంతకుముందు ఇద్దరిని నామినేట్ చేసిన వారి విషయంలో కోర్టు కేసు నడుస్తోందని గుర్తుచేశారు. అయినా కూడా రాజ్యాంగ బద్ధంగానే తాము నామినేట్ అయినట్లు తెలిపారు. గవర్నర్(Governor Tamilisai) కోటాలో ఎన్నికైన తాము ఇవాళ ప్రమాణ స్వీకారం కోసం మండలికి వచ్చినట్లు, తమ ఎన్నికకు సంబంధించి గవర్నర్ కార్యాలయం కూడా గెజిట్ విడుదల చేసిందని తెలిపారు.
Gutha Sukender Reacts on Kodandaram :ఇదే విషయమై స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు ఆయన వివరించారు. ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని ఒక్క మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాత్రమే సమయం అడిగారని గుర్తుచేశారు. ఈ నెల 31 తేదీన సమయం ఇచ్చినట్లు పేర్కొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, అదే రోజు బలమూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్‌లు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.
ఎమ్మెల్సీలుగా మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎన్నిక ఏకగ్రీవం - ఈసీ ప్రకటన
లోక్‌సభ ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్ - రంగంలోకి ప్రస్తుత ఎమ్మెల్సీలు