MLC Kavitha on Women Reservation: మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుత నిర్ణయంతో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఆరోపించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
MLC Kavitha Fires on Congress :ప్రజల రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని కవిత(MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల స్పూర్తిని పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీఓ తీసుకురావడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలను మభ్య పెట్టెందుకే కులగణన తీర్మానం : కవిత
Women Reservation GO in Telangana :ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంతో నష్టం జరిగే అవకాశం ఉందని కవితపేర్కొన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్లతో పాటు రోస్టర్ పాయింట్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. దీనివల్ల మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని అన్నారు. మహిళలకు అవకాశాలు తగ్గుతాయని, రోస్టర్ లేకపోవడంతో మహిళల ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు.
అన్ని శాఖల్లోని ఉద్యోగ నియామకాలపై ఈ ప్రభావం స్పష్టంగా పడుతుందని కవితతెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ అంశాలను గమనించాలని సూచించారు. పాత విధానంలోనే మహిళా రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టులో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల్లో 66 వేలు ఆడబిడ్డలకు కచ్చితంగా వస్తాయా లేదా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.