MLC Jeevan Reddy Strong Comments on KCR :పదేళ్ల పాలనలో కూడబెట్టుకున్న రూ.వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడానికి, ఈడీ నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ బీజేపీతో దోస్తీ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ (KCR) నానా తంటాలు పడుతున్నారని, అందుకే పంటల పరిశీలనకు బయలుదేరుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరవయ్యారన్నారు.
Jeevan Reddy Hot Comments on BJP :రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడకేనని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 స్థానాలు గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని ఇప్పుడు ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వెళుతుందని జీవన్‌రెడ్డి ఆక్షేపించారు. పార్లమెంటు ఎన్నికల్లో (Parliament Elections) బీజేపీ ఖాతా కూడా తెరవదని జోస్యం చెప్పారు.
'బీఆర్ఎస్ను అవినీతి పునాదులపై నిర్మించారు - అందుకే అధికారం కోల్పోగానే కుప్పకూలుతోంది' - Ponnam Prabhakar Fires on BRS
ఈ క్రమంలోనే రైతుల పంటలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ప్రాజెక్టుల్లో చివరి నీటి బొట్టు వరకు కూడా వృథా చేయకుండా సాగు, తాగుకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. రైతాంగంలో సాగునీటి సమస్యలకు కారణమైంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. నాడు రబీ పంటలపై సాగు నీటి ప్రణాళిక రూపొందించకపోవడంతోనే, నేడు నీటి సమస్య ఎదురయ్యిందని ఆయన దుయ్యబట్టారు.
"ప్రాజెక్ట్‌లోని చివరి నీటి బొట్టు వరకు కూడా సాగుకు, తాగుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. దానికి హస్తం పార్టీ నేడు సంపూర్ణంగా సంసిద్ధంగా ఉంది. కానీ నేడు రైతాంగంలో సాగునీటి సమస్యలు ప్రధానంగా తలెత్తడానికి కారణం కేసీఆర్. నాడు మేడిగడ్డ నుంచి నీటిని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు తరలించుంటే, ఇవాళ 10 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ నీటి కొరత రావటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి." -జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ
ఈడీ నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ బీజేపీతో దోస్తీ : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడ్డంకులు అధిగమిస్తూ - వ్యూహాలకు పదును పెడుతూ - గెలుపు దిశగా కాంగ్రెస్ కార్యాచరణ - T Congress Lok Sabha Election Plan
'14 ఎంపీ సీట్లే లక్ష్యంగా గెలిచి తీరాలి' - నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - Congress Focus on MP Elections