తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఫోన్ ట్యాపింగ్​ బాధితుల్లో నేనూ ఉన్నాను : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి - Yennam Srinivas on Phone Tapping

MLA Yennam Srinivas on Phone Tapping Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసుపై మరింత దర్యాప్తు చేపట్టాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ కేసులో తాను కూడా ఒక బాధితుడన్న ఆయన, ఫోన్​ ట్యాపింగ్​కు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని వాటిని డీజీపీకి సమర్పించారు.

LEADERS ON PHONE TAPPING CASE
MLA Yennam Srinivas on Phone Tapping Case

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 5:50 PM IST

Updated : Mar 26, 2024, 7:30 PM IST

MLA Yennam Srinivas on Phone Tapping Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఫోన్ టాపింగ్ కేసులో తాను కూడా ఒక బాధితుడినేనని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నాయకులు, ప్రశ్నించే గొంతులపై ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్​తో అప్పటి ప్రతిపక్ష నాయకులను నిర్బంధంలో పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. ప్రణీత్​రావు బృందం భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి హైటెక్ టెక్నాలజీతో పనిచేసే పరికరాన్ని ఉపయోగించి ఫోన్ టాపింగ్ చేసినట్లు ఆరోపించారు.

వేల సంఖ్యలో బాధితులు : అందుకు తన దగ్గర తగిన ఆధారాలున్నాయని, వాటిని డీజీపీకి సమర్పించారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రణీత్​ రావు ముఠా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్లు పెట్టి, రాజధాని కేంద్రంగా ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ టాపింగ్ దుర్మార్గమైన చర్యని, ఎవరి ఒత్తిడి వల్ల చేశారో తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Congress leader Niranjan reddy on Phone Tapping Case : ఇదికాగా మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని, రాష్ట్రంలోనూ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ధ్వజమెత్తారు. ముగ్గురు కీలకమైన అధికారులు రెవెన్యూ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రణీత్​రావు బ్యాచ్‌ వ్యాపారస్థులను కూడా బ్లాక్‌ మెయిల్ చేసి వేల కోట్లు దండుకుందని మండిపడ్డారు. ఈ విషయంలో డీజీపీ, హోం సెక్రటరీకి లేఖ రాస్తామని తెలిపారు.

'గత అయిదు సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితో ఫోన్​ ట్యాపింగ్​ చేశారో. దానికి ఎవరు సూచన ఇస్తే ఫోన్​ ట్యాపింగ్ చేశారో తెలియాలి. వివిధ జిల్లాలో సర్వర్లు ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలు, బంగారు వర్తకులు, ధనవంతులు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల వాయిస్​ విని వాళ్లతో లావాదేవీలు చేశారో, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలని ఈరోజు నేను డీజీపీని కోరుకుంటున్నా. కేవలం హైదరాబాద్​ బేస్​గా ఇన్వెస్టిగేషన్​ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లాలో ఉన్నారు. అక్కడ కూడా దీని కోసం ప్రత్యేక సెల్​ ఏర్పాటు చేయాలి.'- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే

ఫోన్ ట్యాపింగ్​ బాధితుల్లో నేను ఉన్నాను : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు : ఎర్రబెల్లి దయాకర్‌ - ERRABELLI ON PHONE TAPPING CASE

''ఫోన్​ ట్యాపింగ్​'లో కొందరినే బాధ్యులు చేయడం సరికాదు - సీబీఐతో విచారణ జరిపించాలి' - BJP on Phone Tapping Case

Last Updated : Mar 26, 2024, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details