తెలంగాణ

telangana

ETV Bharat / politics

'నేను పార్టీలోకి వచ్చిందే అందుకు - ఆ పదవి ఇస్తేనే వాళ్లు కంట్రోల్​లో ఉంటారు' - Telangana Budget Sessions 2024

MLA Rajgopal Reddy Comments on BRS : మంత్రివర్గ విస్తరణలో తనకు హోంమంత్రి పదవి కోరుతున్నానని, అందుకు అధిష్ఠానం హామీ కూడా లభించినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకని, తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్‌లో ఉంటారని అభిప్రాయపడ్డారు.

Conversation Between KTR and Rajgopalreddy
MLA Rajagopal Reddy Comments on BRS

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 3:49 PM IST

MLA Rajgopal Reddy Comments on BRS :అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopalreddy) స్పష్టం చేశారు. తనకు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని, అందుకు అధిష్ఠానం కూడా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకని, తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్‌లో ఉంటారని తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, కవిత, సంతోష్‌రావు,జగదీశ్​రెడ్డితో సహా అయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ కు కుటుంబ సభ్యులెవ్వరూ పోటీ చేయకూడదనేది తమ ఉద్దేశ్యమన్నారు. పార్టీ అదేశిస్తే పోటీ చేస్తామని, ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని తెలిపారు. త్వరలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని, కేసీఆర్‌కు(KCR) బీజేపీయే శ్రీరామరక్షగా పేర్కొన్నారు.

నాలుగు రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Conversation Between KTR and Rajgopalreddy : అంతకుముందు అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీమంత్రి కేటీఆర్(KTR) మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. మంత్రి పదవి ఎప్పుడొస్తుందని కేటీఆర్ అడగ్గా, రాజగోపాల్ రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. ఇరువురి నేతల మధ్య మధ్య ఈ కింది విధంగా సంభాషణ చోటుచేసుకుంది.

కేటీఆర్ :మంత్రి పదవి ఎప్పుడు వస్తది అన్నా?

రాజగోపాల్​రెడ్డి : మీ లాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోంది

కేటీఆర్ : ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయి

కేటీఆర్ : రాబోయే ఎన్నికల్లో ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా ? సంకీర్త్ పోటీ చేస్తున్నారా ?

రాజగోపాల్​రెడ్డి : దయచేసి నన్ను వివాదాల్లోకి లాగవద్దు. అంటూ అక్కణ్నుంచి వెెళ్లిపోయారు.

Telangana Budget Sessions 2024 :మరోవైపు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ గవర్నర్ ధన్యవాద తీర్మానం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. ఈనెల 9, 10, 12, 13 తేదీల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 9వ తేదీన గవర్నర్ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 10వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

నీటి పారుదల శాఖలో ప్రక్షాళన స్టార్ట్ - ఇద్దరు ఈఎన్సీలపై వేటు వేసిన సర్కార్

గతంలో నిర్వహించిన గ్రూప్​-1 రద్దు - అదనంగా మరో 60 ఖాళీలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details