తెలంగాణ

telangana

ETV Bharat / politics

మహిళకు ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే ఫోన్​ - వెకిలి సంభాషణ - ఆడియో వైరల్ - MLA Gorle Kiran Kumar Audio Viral - MLA GORLE KIRAN KUMAR AUDIO VIRAL

MLA Gorle Kiran Kumar Misbehavior With Woman : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ ఓ మహిళకు ఫోన్‌ చేసి వెకిలిగా మాట్లాడారు. ఆయన ఆమెతో చేసిన సంభాషణ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎమ్మెల్యే అనంతరం ఆయన అనుచరుడు ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడిన సంభాషణ సైతం వెలుగులోకి వచ్చింది.

MLA Gorle Kiran Kumar Misbehaviour With Women
MLA Gorle Kiran Kumar Misbehaviour With Women

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 2:13 PM IST

మహిళకు ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే ఫోన్​ - వెకిలి సంభాషణ - ఆడియో వైరల్

MLA Gorle Kiran Kumar Misbehavior With Woman :శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ ఓ మహిళకు ఫోన్‌ చేసి వెకిలిగా మాట్లాడారు. ఆయన ఆమెతో చేసిన సంభాషణ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎమ్మెల్యే అనంతరం ఆయన అనుచరుడు ఆమెకు ఫోన్‌ చేసి సార్‌ ఇందాక మీ ఫొటో చూశారు, మీకు చేస్తామన్నారు, చేశారా? అంటూ మాట్లాడిన సంభాషణ సైతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏంటీ!! వీళ్లు మంచోళ్లా​? - వాళ్లు చేసే అరాచకాలు చూసే అంటున్నావా జగన్! - Lok sabha Election2024 IN AP

ఎమ్మెల్యే:హూ ఎమ్మెల్యేను.
మహిళ:హా సార్‌.
ఎమ్మెల్యే:ఏం రాలేదు. మీరు లెటర్‌కు వస్తానన్నారు.
మహిళ:అంటే మీరు టు డేస్‌ టైం పడతాదన్నారు కదా సార్‌.
ఎమ్మెల్యే:అన్నా రావాలి కదా మరి నువ్వు
మహిళ:మరి రావాలంటే. మీరొద్దన్నారని రాలేదు సార్‌
ఎమ్మెల్యే:వద్దన్నా మీ పనికి మీరు తిరగాలి. రావాలి కదా.
మహిళ:వస్తాం సార్‌, రేపు వస్తాం.
ఎమ్మెల్యే:రేపా ఫోన్‌ చేయ్‌ ఈవేళ వైజాగ్‌ వెళ్తున్నాం. ఇప్పుడు ఉండం గాని, ఫోన్‌ చేసి రా అయితే.
మహిళ:ఒకే సార్‌
ఎమ్మెల్యే:మావాడు మాట్లాడతాడు లే..
మహిళ:ఏంటి సార్‌!
(ఇదంతా ఎమ్మెల్యే ఆ మహిళతో మాట్లాడిన సంభాషణ. ఆ తరువాత కొద్దిసేపటికి ఆయన అనుచరుడు ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడారు.)

ఎమ్మెల్యే అనుచరుడు:హలో
మహిళ:సార్‌ చెప్పండి
ఎమ్మెల్యే అనుచరుడు:సార్‌ ఇందాక మీ ఫొటో చూశారు. మీకు చేస్తామన్నారు చేశారేంటి.
మహిళ:హా ఇప్పుడే చేశారు సార్‌ ఫోన్‌
ఎమ్మెల్యే అనుచరుడు:హాహా నేను వేరే దగ్గరకు వెళ్లాను. ఇందాకే పెట్టాను నీ ఫోన్‌ నంబరు
మహిళ:హా ఇప్పుడే చేశారు సార్‌ ఫోన్‌ ఏం రాలేదని అంటున్నారు. ఆయన టు డేస్‌ టైం ఇచ్చిన తరువాత మనం ఎలా వెళ్తాం సార్‌.
ఎమ్మెల్యే అనుచరుడు:అలగనా మరి ఇవాళ సండేగా కొంచెం ఆయనకు ఫంక్షన్లు ఉన్నాయి.
మహిళ:ఊఁ.
ఎమ్మెల్యే అనుచరుడు:మీరు రేపు ఏ టైమ్‌ అనేది చెప్తే నేను ఆయనకు చెప్తాను.
మహిళ:ఆ అలాగే సార్‌ అంటే మీరు చెప్తే మేం వస్తాం కదా సార్‌. మా టైం మీకెలా సెట్‌ అవుద్ది.
ఎమ్మెల్యే అనుచరుడు:హా హా అలగనా ఏటి అలాగే మరి. మరి మీ మీద సార్‌ ఇంటస్ట్ర్‌గా మాట్లాడుతున్నారు. ఫొటో గట్రా చూసిన కానించి!
మహిళ:ఎవరు సార్‌
ఎమ్మెల్యే అనుచరుడు:ఆయనే ఎమ్మెల్యే గారే.
మహిళ:ఇంటస్ట్ర్‌గా మాట్లాడటమేంటి సార్‌.
ఎమ్మెల్యే అనుచరుడు:ఆయన ఏదున్నా నాకు చూపించి చెప్పండి
మహిళ:ఏంటి సార్‌
ఎమ్మెల్యే అనుచరుడు:నాకు ఫోన్‌ చేయండి అంటున్నా!

Recording Dance: బ్రహ్మోత్సవాల్లో రికార్డింగ్​ డాన్స్​.. యువతులతో వైసీపీ నేతల చిందులు

అరాచక 'గ్రంథం' - గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత - YSRCP Leader Irregularities

ఆ విషయం నాకు ముందే తెలుసు.. వీడియోను పెద్దగా పట్టించుకోలేదు: గోరంట్ల మాధవ్‌

ABOUT THE AUTHOR

...view details