Arekapudi Gandhi On Kaushik Reddy News :ప్రజలు, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆయన ఇంటికి వెళ్తే రాళ్లు రువ్వారని, పూల కుండీలు విసిరారని ఆరోపించారు. తమపైనే బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని, తాము ఎవరి జోలికీ వెళ్లలేదని అన్నారు. కేసీఆర్ అంటే ఎప్పటికీ తనకు గౌరవమేనని, ఆయన వారిని ఆదరించారని, ఆశీర్వదించారని తెలిపారు. కానీ కౌశిక్‌రెడ్డి వంటి చీడపురుగులు బీఆర్‌ఎస్‌కు మచ్చ తెస్తున్నారని విమర్శించారు.
Arekapudi Gandhi Slams MLA Kaushik Reddy :కౌశిక్‌రెడ్డి వల్ల కేసీఆర్ గొప్పతనానికి, గతంలో చేసిన సేవలకు చెడ్డపేరని అరెకపూడి అన్నారు. అతడి లాంటి వారి వల్ల అధికారాన్నే కోల్పోయామని తెలిపారు. నోటికి అదుపులేని మనిషిని ఊరుమీదకు వదిలేశారని విమర్శించారు. జూనియర్ శాసనసభ్యుడైన కౌశిక్ సీనియర్ నేతనైన తనను దుర్భాషలాడారని మండిపడ్డారు గాంధీ. కౌశిక్‌రెడ్డి మాయమాటలు నమ్మి పెద్దాయన (కేసీఆర్‌ను ఉద్దేశించి) ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, కానీ పదవి వచ్చిన తర్వాత ఆయన క్రమశిక్షణ మరిచిపోయారని అన్నారు.
నా యుద్ధం కౌశిక్ రెడ్డితోనే - బీఆర్ఎస్తో కాదు : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ - Arekapudi Gandhi Latest Comments
కౌశిక్ రెడ్డికి రౌడీయిజం ఎందుకు?తనతో మాట్లాడడానికి బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరా? అని అరెకపూడి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌశిక్‌రెడ్డికి ఏమైనా పదవి ఇచ్చిందా? అని నిలదీశారు. కౌశిక్‌రెడ్డి రౌడీయిజం చేయడం దేనికని, గతంలోనూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించిన కౌశిక్‌రెడ్డి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టినందునే తాను మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
"పాడి కౌశిక్ రెడ్డి భాషను కేసీఆర్, హరీశ్ సమర్థిస్తే నేను సమర్థిస్తాను. అక్రమ సంపాదనపై కౌశిక్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అమెరికా నుంచి ఫోన్లో హెచ్చరికలు రావటంతోనే ఈరోజు తగ్గి మాట్లాడారు. నా భాష గురించి మాట్లాడుతున్న హరీశ్, గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆయన మాటలను గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఇంటిపై జెండా ఎగుర వేయడానికి కౌశిక్ ఎవరు? ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయటానికే కౌశిక్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు."- అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే
మేమూ దాడులు చేయగలం కానీ - తెలంగాణ ఇమేజ్ పాడవ్వొద్దని ఆగుతున్నాం : హరీశ్ రావు - HARISH RAO SLAMS CONGRESS GOVT
పాడి vs గాంధీ : 'నేడు అరెకపూడి నివాసంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం' - హాజరుకానున్న కౌశిక్‌రెడ్డి - Padi Kaushik Reddy Vs Arekapudi