ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

తగ్గిన కృష్ణమ్మ ఉద్ధృతి - ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు - Flood Affected Areas in Vijayawada

Flood Affected Areas in Vijayawada: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన బెజవాడ నగరంలోని కొన్ని కాలనీలను ఇంకా ముంపు వీడలేదు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న మంత్రులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది.

Flood Affected Areas in Vijayawada
Flood Affected Areas in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 8:32 PM IST

Flood Affected Areas in Vijayawada :భారీ వర్షాలు తెచ్చిన ముంపు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. విద్యాధరపురంలో బస్సు డిపోలో నీట మునిగింది. 40 బస్సులు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి ఇంకా వరద వీడలేదు. బస్సు డిపోలో 20 బస్సులు ఇంకా వరదలోనే ఉన్నాయి. నగరంలోని వరదల్లో ఆర్టీసీ సిబ్బంది చిక్కుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు లేక అనేక రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. కొన్ని రూట్లలో బస్సులు కొరతతో దూరప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసిన్నట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా కాలేజీలు నీటమునగడంతో సెలవులు ప్రకటించారు. సొంతూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు బస్టాండ్​కు చేరుకుంటున్నారు.

బాధితులకు ఆహారం పంపిణీ : కృష్ణమ్మ ఉద్ధృతి తగ్గడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాణిగారితోట, రామలింగేశ్వర్ నగర్‌లో వరద తగ్గింది. జనం నిత్యావసరాలు తెచ్చుకునేందుకు బయటకు వస్తున్నారు. ముంపులో ఉన్న కాలనీల్లో ఆహార ప్యాకెట్లు, మంచినీరు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అధికారులు పంపిణీ చేస్తున్నారు.

వరద ప్రాంతాల్లో జేసీబీపై చంద్రబాబు పర్యటన - సహాయకచర్యలపై ఆరా - CM Chandrababu Tour On JCB

వరదలో చిక్కుకున్న వాళ్లని పునరావాస కేంద్రాలకు తరలింపు : యనమలకుదురు ప్రాంతంలోని అనేక కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు వెనక్కి వెళ్లింది. ప్రజలు ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. పునరావాసస కేంద్రాలు, ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భోజనం అందిస్తున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్లని పునరావాస కేంద్రాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు మత్స్యకారులు తరలించారు. పెదపులిపాక ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

బాధితులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి : భవానీపురం లలితానగర్‌లో హోంమంత్రి అనిత ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. మోకాళ్లలోతుపై ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్​పైన ప్రయాణం చేస్తూ కాలనీ వాసులకు ఆహారం అందించారు. చిన్నారులు, మహిళలు, ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు తెలుసుకున్నారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రణధీర్ నగర్, రాణిగారితోట ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. బాధితులను పరామర్శించారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - రాష్ట్రానికి వర్ష సూచన ! - Rains Alert in AP

3 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ : నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్ల పంపిణీని మంత్రి నారాయణ పరిశీలించారు. 3 లక్షల వాటర్ బాటిల్స్ బాధితులకు పంపిణీ కోసం పంపించిన్నట్లు మంత్రి వివరించారు. ఆహారంతో పాటు అరటిపండ్లు అందిస్తున్నారు.

మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి :నగరంలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అపశృతి జరిగింది. ప్రమాదవశాత్తు షాక్ కొట్టి వజ్రాల కోటేశ్వరరావు అనే లైన్‌మెన్ మృతి చెందాడు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుడిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఎవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

ABOUT THE AUTHOR

...view details