Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై కేసీఆర్, మాజీమంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, కమీషన్ల కక్కుర్తితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ఆయన దుయ్యబట్టారు. 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, 15 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా దక్కదని దుయ్యబట్టారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లు 'సున్న' : ఉత్తమ్ కుమార్ రెడ్డి - Cong Raghuveer reddy Nomination
Minister Uttam comments KCR :రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయింపు జరిగిందని, ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించినట్లు పేర్కొన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తానని కేసీఆర్ చెప్పడంలో అర్థం లేదని, మేడిగడ్డ కుంగితే అధికారంలో ఉన్నపుడే ఎందుకు మరమ్మతు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఉభయ రాష్ట్రాలకు కేటాయించిన 811 టీఎంసీలలో 75 శాతం తెలంగాణకు రావాలని కృష్ణ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా కృష్ణా జలాలను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కేటాయింపు నీటికంటే ఎక్కువ తీసుకున్నారని దుయ్యబట్టారు.
నీటి కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోరామని, కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక మరింత ఎక్కువ అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెద్దమొత్తంలో నీటిని తరలించుకుపోయారన్నారు. 2018 వరకు ఆనీటి దోపిడీ కొనసాగిందన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రేగులటరీ నుంచి 11వేల క్యూసెక్కులు తీసుకెళ్లారని, వైఎస్సార్ హయాంలో 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లారన్నారు.
కేసీఆర్ హయాంలో జగన్‌మోహన్ రెడ్డి రోజుకు 8 టీఎంసీల తరలించుకెళ్లారని, కేసీఆర్ జగన్‌లు కలిసిన తర్వాతనే నీటి తరలింపు జరిగిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 కృష్ణ ఔటర్ బేసిన్‌కి 727 టీఎంసీలు తీసుకెల్లితే, ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో 1201 టీఎంసీలు తరలించుకెళ్లారన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
"రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తానని కేసీఆర్ చెప్పడంలో అర్థం లేదు. మేడిగడ్డ కుంగితే అధికారంలో ఉన్నపుడే ఎందుకు మరమ్మతు చేయలేదు".- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి
మేడిగడ్డ కుంగితే అప్పుడే ఎందుకు మరమ్మతు చేయలేదు- కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్ బీజేపీ గత పదేళ్లలో మతతత్వ రాజకీయం తప్ప చేసేందేమీ లేదు : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on BJP
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్ - Minister Uttam on Grain Purchase