Tummala Nageswara Rao Fires On KTR :ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ రాసిన బహిరంగ లేఖ(Open Letter) మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉందని చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల పేరు మీద అనర్హులకు లబ్ధి చేకూర్చి నేతన్నల(Weavers )బతుకులను ఛిన్నాభిన్నం చేసి ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. ఆమోదం లేని చేనేత మిత్ర వంటి పథకాలను(Scheames) ప్రవేశపెట్టి బీఆర్ఎస్ నేతన్నల ఉసురు పోసుకుందని ఆయన విమర్శించారు.
Tummala comments on KTR
రాష్ట్రంలో 393 చేనేత సహకార సంఘాలుంటే బీఆర్ఎస్ కేవలం 105 సంఘాలకు మాత్రమే పని కల్పించటం వల్ల నిజమైన కార్మికులను లబ్ధి చేకూరలేదని మంత్రి తుమ్మల విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా నేతన్నలకు చేతినిండా పని కల్పించేందుకు రూ.53 కోట్ల విలువైన వస్త్రాలు వారి నుంచి కొనుగోలు చేశామన్నారు. గత ప్రభుత్వం 2023 బతుకమ్మ చీరల పథకం కింద టెస్కోకు చెల్లించవలసిన రూ.351 కోట్లను కూడా చెల్లించలేదని విమర్శించారు.
ఎన్నికల ఆర్బాటంగా పెట్టారు : తుమ్మల
ఎన్నికల(Elections) ముందు ఆర్భాటంగా పథకాలు మొదలు పెట్టి ప్రారంభాల పేరిట దుబారా ఖర్చు పెట్టి ఎన్నికలవ్వగానే పథకాలను బీఆర్ఎస్ మూలన పడేసిందని అన్నారు. చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చేందుకు నేతన్న భరోసా అనే విధానాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.
KTR on Handloom Workers Problems
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండగలా కళకళలాడిన చేనేత రంగం, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు ఉన్న విపత్కర పరిస్థితిని ఇప్పుడు చేనేత రంగం ఎదుర్కొంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరమవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.