Minister Sridhar Babu Election Campaign in Peddapalli : కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి, ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు రైతులు పేరిట దొంగ దీక్ష చేస్తున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రి, గులాబీ పార్టీపై(BRS Party) తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి ప్రాంతం పారిశ్రామికంగా మరింత వృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలన్నారు.
ప్రతి కార్యకర్త, నాయకుడిది ఈ ఎన్నిక : సింగరేణి కార్మికుల సమస్యలు, కేశోరాం సిమెంట్ విషయంలోను సమస్యలు పరిష్కరించేందుకు ఇక్కడి ఎమ్మెల్యే గతంలో ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయనకు మరింత బలంగా తయారు చేయాలన్న, జెన్కో విస్తరణ(Zen Co Expansion) పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు మద్దతుగా వంశీను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నిక ప్రతి కార్యకర్త, నాయకుడిదని మంత్రి పేర్కొన్నారు.
అందరి ఫోన్లు ట్యాప్ చేశారు - నిందితులందరూ బయటకు వస్తారు : శ్రీధర్ బాబు - lok sabha elections 2024
"యువకులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని, వంశీను పార్టీ ఎంపిక చేసింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటా సమస్యలు పరిష్కరిస్తా అంటున్న ఎంపీ అభ్యర్థి వంశీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గతంగా చిన్నచిన్న సమస్యలు ఉన్నా మంచి నాయకుణ్ని అందించాల్సిన అవసరం ఉందనే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది."-శ్రీధర్ బాబు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి