Minister Seethakka Comments on PM Modi : ప్రధాని మోదీ భారతదేశాన్ని పాకిస్థాన్‌తో పోల్చి దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మణుగూరులో బుధవారం పర్యటించిన సీతక్క, అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయం వచ్చిందంటే దేశ సైనికుల(Country Soldiers) సమస్యలు, మరణాలు, చాయ్‌వాలా, పాకిస్థాన్ వంటి విషయాలే బీజేపీకి గుర్తుకు వస్తాయన్నారు.
పదేళ్లు దేశాన్ని పాలించిన కాషాయం పార్టీ చేసిన అభివృద్ధిని తీసుకొచ్చిన చట్టాలను వివరించకుండా పాక్‌తో భారతదేశం పోటీపడుతుందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇండియా అమెరికా(America Country) వంటి దేశాలతో పోటీ పడే స్థానాల్లో ఉందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఓట్ల రాజకీయం కోసం ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించటం పాకిస్థాన్ వంటి చిన్న దేశంతో భారతదేశాన్ని బీజేపీ పోల్చుతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే కమలం పార్టీ మతవిద్వేషాల రాజకీయం చేస్తోందన్నారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నా : సీతక్క - Minister Seethakka On Murder Case
"ప్రధాని మోదీ మాట్లాడితే చాలు మన దేశాన్ని పాకిస్థాన్‌తో పోల్చుతున్నారు. ఈ దేశ గౌరవాన్ని కుల, మత రాజకీయాలకు అధికారం కోసం పాక్‌తో పోల్చి ఇండియా ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు. దాయాది దేశం స్థాయిలో భారత్ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలు రాగానే సైనిక సమస్యలు, చాయ్‌వాలా, పాకిస్థాన్ ఇవే గుర్తొస్తున్నాయి తప్ప పదేళ్ల బీజేపీ పాలనలో మీరు ఏమి అభివృద్ధి చేశారో ఎందుకు చెప్పటం లేదు."-సీతక్క, మంత్రి