Minister Ponnam on Govt Schools Development : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు భాగ్యనగరంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన, అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.55 లక్షల వ్యయంతో ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం, పలు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.
త్వరలో 'కల్లు బార్లు' ఏర్పాటు దిశగా ప్రభుత్వ కార్యాచరణ : మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి నూతన విద్యా పాలసీని తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాలు మారినా, విద్యా వ్యవస్థకు అన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని నిరాశ్రయులైన పిల్లలకు ప్రభుత్వ విద్యాసంస్థలు అండగా నిలవడంతో పాటు వారిని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎలాంటి రాజీపడకుండా ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఠా గోపాల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ డీఈవో రోహిణితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన పొన్నం ప్రభాకర్ - త్వరలోనే మిగతా హామీలు అమలు చేస్తామన్న మంత్రి
హామీల అమలే కాదు - సంక్షేమానికీ పెద్ద పీట : అంతకుముందు సనత్‌నగర్ నియోజకవర్గం బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని గొల్ల కొమురయ్య కాలనీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాల మూలంగా చిన్నారులకు ప్రాథమిక అభివృద్ధితో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పేదలు, విద్యార్థుల సంక్షేమానికి కూడా పాటు పడుతుందని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, స్థానిక కార్పొరేటర్ కూర్మ హేమలత తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలన సాగిస్తున్నాం : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజాపాలన దిశగా పాలన సాగిస్తుందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమీర్‌పేటలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని, ప్రభుత్వ పాఠశాల అదనపు గదులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బల్కంపేటలో నూతన అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవం, డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం హుస్నాబాద్ అభివృద్ధిపై మాట్లాడితే - నా తల్లినే అవమానిస్తారా? : మంత్రి పొన్నం