Minister Ponnam Prabhakar on Hydra Project :చెరువుల పరిరక్షణకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతాయని రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై స్పందించిన ఆయన రాష్ట్రంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు. తెలంగాణలో ముందుగా రాజధాని నగరంలో తర్వాత అన్ని జిల్లాల్లో ఏఏ చెరువులు ఆక్రమణకు గురయ్యాయో గుర్తిస్తారని, తర్వాత వాటి పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుంచి పరిరక్షించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
గంతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వం లెక్కలకు అనుగుణంగా కూల్చివేతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు, గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన వారు ఏవరైనా పోలీసు అధికారులు, రెవెన్యూ, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెరువుల పరిరక్షణ స్థానికులదేనని ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయదన్నారు.
"తెలంగాణ రాష్ట్రంలో ముందుగా హైదరాబాద్‌లో తదుపరి అన్ని జిల్లాల్లో ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో వాటిని పునరుద్ధిరించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. భౌగోళిక పరిస్థితులను కాపాడుకుంటూ కాలుష్యాన్ని తగ్గించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన వారు ప్రభుత్వానికి కానీ, అధికారులు, పాత్రికేయుల దృష్టికి తీసుకురావాలి." - పొన్నం ప్రభాకర్, మంత్రి