Komati Reddy Shocking Comments on KCR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూ.26 వేల కోట్లు వడ్డీలకే చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జాతీయ బ్యాంకుల వద్ద 10 నుంచి 12 శాతం వడ్డీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని అన్నారు. ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట గత ప్రభుత్వం రూ.వేల కోట్లు కుంభకోణం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గత ప్రభుత్వ లోపాలను తెలిపారు.
Komati Reddy on Medigadda Project :ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ పోయిన సంవత్సరమే దశాబ్ది ఉత్సవాలు చేశారని, మళ్లీ శనివారం మెుదలుపెట్టారని పేర్కొన్నారు. అధికారం పోయిందని దుఃఖం వచ్చిందని రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారని విమర్శించారు. ఆ సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారని వ్యాఖ్యానించారు. దీంతో పాటు కేసీఆర్‌తో భోజనం చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని తెలిపారు.
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే : మంత్రి కోమటి రెడ్డి - Komatireddy Fires On KCR