Minister Kolusu Pardha Saradhi on AP Cabinet Decisions : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాల్సిన వారికి ఇచ్చేందుకే రివర్స్ టెండరింగ్ విధానం తెచ్చిందని, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసి పాత విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పార్థసారథి తెలిపారు.
సీవీసీ సిఫారసుల మేరకు పారదర్శకంగా టెండర్ల విధానం జరుగుతోందని అన్నారు. సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి, అలాగే మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ - పాస్ మిషన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధుల విడుదలకు చేయనున్నట్లు తెలిపారు.
మంత్రుల పనితీరుపై కేబినెట్ భేటీలో ప్రస్తావన- ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్న చంద్రబాబు - CM on Ministers Performance
వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత :సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం చేసిందిని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో, రాజకీయ పార్టీల లోగో తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. 21.86లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు.
దస్త్రాల దహనంపై ప్రభుత్వం ఆగ్రహం :గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం వచ్చిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే నకిలీ మద్యం, డ్రగ్స్ పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 36 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిపారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర విచారణ చేస్తున్నామని, అసైన్డ్ భూముల బాధితులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని తెలిపారు. బలవంతంగా లాక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేదా చూస్తామని అన్నారు. దస్త్రాల దహనం ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు.
రివర్స్ టెండర్ల విధానానికి స్వస్తి పలకనున్న కూటమి - సచివాలయంలో కేబినెట్ భేటీ - Cabinet Meeting in Secretariat
పేపర్ లెస్ కేబినెట్ సమావేశాలు- మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం