Raghunandan Rao Fires on BRS and Congress : అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు రాజకీయ సన్యాసం తీసుకుని ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేసుకోవాలని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నిజాంపేటలో బీజేపీ నాయకులు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తిట్టినట్టు, హరీశ్‌రావు ఏడ్చినట్టు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, తప్పైందని హరీశ్ రావు అమరవీరుల స్ధూపం వద్ద ముక్కు నెలకు రాసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసరాలని తెలిపారు. తాను చేయలేనిది ఇంకొకరిని చేయమని చెప్పడం అర్ధరహితం అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటై బీజేపీపై ప్రజలకు వ్యతిరేకత రావటానికి ఒకరకమైన కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. హరీశ్ రావుకు మాట్లాడడమే తప్ప ఏం చేతకాదన్నారు.
తెలంగాణకు హాని చేసే వారు ఎవరైనా సరే వారితో పోరాడతాం : రఘునందన్ రావు - Raghunandan Rao Meet The Press
Medak BJP Candidate Raghunandan Rao Election Campaign : పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని పనిని ఐదు నెలలు కాకముందే ఎగబడుతున్నారంటే రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఇద్దరు బదురుకుని వచ్చారన్నారు. మెదక్‌లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకే రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కొత్త నాటకానికి తెర లేపారని మండిపడ్డారు. కానీ వీరిద్దరు రాజీనామా చేసేవాళ్లు కాదని అన్నారు. రాజీనామా చేయాలని సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్ అంతా వారిపై ఉండేటట్లు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
"రైతు రుణమాఫీ చేయలేని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు అయిన మామ అల్లుడు ఇద్దరు రాజకీయ సన్యాసం తీసుకుని ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయాలని బీజేపీ తరఫున సూచన. దొంగా, చీకటి ఒకటైనట్టు రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారు. కేటీఆర్‌కు ఇది అర్థం కాదు." - రఘునందన్ రావు, మెదక్ బీజేపీ అభ్యర్థి
దొంగా, చీకటి ఒకటైనట్టు రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా కేటీఆర్‌కు తెలిసేలోపే హరీశ్‌రావు కొత్త పార్టీ పెడతారని జోస్యం చెప్పారు. ఇవన్నీ తెలియని వ్యక్తి కేటీఆర్ అన్నారు. హరీశ్ రావు విషయంలో కేటీఆర్ జాగ్రత్త పడాలని సూచించారు. ముస్లిం రిజర్వేషన్ పట్ల బీజేపీ మాత్రమే క్లియర్‌గా ఉందని తెలిపారు. ఓబీసీ, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు.
Raghunandan Rao Muslim Reservation :కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ముస్లింలతో వీడదీయరాని బంధం ఉందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నామన్నా ఆయన ఎప్పుడూ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పాలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే నయవంచన అని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. అలాంటిది రేవంత్ కొత్త నాటకాన్ని తెరలేపారని ధ్వజమెత్తారు.
అధికారంలో ఉన్నప్పుడు చేయని రుణమాఫీ గురించి హరీశ్‌రావు మాట్లాడటం అర్ధరహితం రఘునందన్‌రావు దేశంలో మోదీ గాలి వీస్తోంది, ఈసారి 400 సీట్లు సాధిస్తాం - గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ - Gujarath Cm Election Campaign
'కలెక్టర్‌గా ఉన్నప్పుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి రూ.కోట్లు దండుకున్నాడు - అందుకే రూ.100 కోట్లతో అభివృద్ధి అంటున్నాడు' - Raghunandan Rao on Venkatrami Reddy