ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు జనసేనలో చేరనున్న ఎంపీ వల్లభనేని బాలశౌరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 9:06 AM IST

Machilipatnam MP Vallabhaneni Balasowry: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నారు. అధికార పార్టీ నిర్ణయాలతో, స్థానిక ఎమ్మెల్యేలతో విసిగిపోయిన ఎంపీలు, నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో చేరి అధికార పక్షానికి షాక్ ఇస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Machilipatnam_MP_Vallabhaneni_Balasowry
Machilipatnam_MP_Vallabhaneni_Balasowry

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మరో ఎంపీ - నేడు జనసేనలో ఎంపీ వల్లభనేని బాలశౌరి చేరిక

Machilipatnam MP Vallabhaneni Balasowry : పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో నేడు జనసేనలో చేరుతున్నట్టు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన బాలశౌరి పవన్‌ కల్యాణ్‌ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందరు పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలోని ఏపీలో పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు. పోలవరం, స్టీల్‌ప్లాంట్‌పై పవన్‌తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని బాలశౌరి అన్నారు. ఎమ్మెల్యే పేర్నినానితో విసిగిపోయిన స్థానిక నేతలు ఎంపీ వెంట నడవడానికి సిద్ధమయ్యారు.

Krishna District YSRCP Leaders Join In Janasena Party : కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీలో కీలక పట్టున్న నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ కౌన్సిలర్‌ కోసూరు నాంచారయ్య నివాస గృహంలో నిర్వహించిన సమావేశంలో తనతో పాటు పార్టీ సీనియర్‌ నాయకుడు మాదివాడ రాము, యర్రంశెట్టి నాని పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. మధ్యలో పార్టీలోకి వచ్చిన పేర్ని నానిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఒంటెద్దు పోకడలతో కార్యకర్తలను అవమానలకు గురి చేస్తున్నారని వారు తెలిపారు.

ఎవరి లెక్కలు వారివే! - వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల పర్వం

YSRCP Leaders Resign :నాంచారయ్య మాట్లాడుతూ ఆదివారం కాలేఖాన్‌పేట నుంచి దాదాపు 1000 మంది మద్దతుదారులతో ర్యాలీగా మంగళగిరి వెళ్లి ఎంపీ వల్లభనేని బాలశౌరికి మద్దతుగా వారితో పాటు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. అభివృద్ధి జాడే లేని వైఎస్సార్సీపీ పాలనపై అందరూ విసిగి వేసారిపోయారని, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యే సమయానికి పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పూర్తిగా ఖాళీ కానుందని అన్నారు.

అవమానాలు, అనిశ్చితికి తెర - ఎంపీ లావు రాజీనామాకు కారణమదే!

ఎమ్మెల్యే పేర్ని నాని ఒంటెద్దు పోకడలతో అవమానాలు : మాదివాడ రాము మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న తాను అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చిన పేర్ని నాని రాష్ట్రం మొత్తం మీద వైఎస్సార్సీపీ గాలి బలంగా ఉన్నా కార్యకర్తల కృష్టితో అతికష్టం మీద స్వల్ప ఆధిక్యతతో గెలిచారని గుర్తు చేశారు. ఆయన అధికారం దక్కించుకున్నాక ఒంటెద్దు పోకడలతో ఎంపీ వల్లభనేని బాలశౌరిని అవమానపర్చేలా వ్యవహరించడం, ఆయన ద్వారా నియోజకవర్గం అందిపుచ్చుకోవాల్సిన అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారడం హేయమని అన్నారు. త్వరలో నియోజవర్గ పరిధివలో వైఎస్సార్సీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

వైసీపీ దోపిడీ పాలనలతో విసిగిపోయారు - జగన్‌ను ఇంటికి పేందుకు జనం సిద్ధం : రమేష్

ABOUT THE AUTHOR

...view details