Lok Sabha Elections Campaign In Telangana 2024 : ఉద్యమ నాయకుడిగా కేసీఆర్(KCR)కు పాలనాపగ్గాలు అప్పగిస్తే, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిపేట్‌లో జరిగిన ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎస్సారెస్పీ (SRSP)ని నిర్మించిందని వివరించారు. కానీ బీఆర్ఎస్ నేతలు కమీషన్లకి కక్కుర్తిపడి కట్టిన ప్రాజెక్టులు మూన్నాళ్ల ముచ్చటగానే మారాయని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే కరవు వచ్చిందన్న విమర్శలను ఖండించారు. పసుపు బోర్డు తెస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆర్వింద్ మాట తప్పారని ఆయన మండిపడ్డారు.
'మేడిగడ్డలో ఉన్న నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ఆర్వింద్‌కు చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారో అమలు చేాయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం ఉత్తర్వులకే పరిమితై రైతుల ఆశలపై నీళ్లు చల్లారు.'-జీవన్‌రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి
BRS MP Candidates on Congress :అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్(Congress) ప్రజలను నమ్మించి మోసం చేసిందని నాగర్‌కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన నియోజకవర్గస్థాయి సన్నాహక భేటీలో పాల్గొన్న ఆయన, అధికారపార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా లొంగిపోవద్దని సూచించారు. కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మి ఓట్లువేసిన ప్రజలకు 100 రోజుల్లోనే వారి బాగోతం అర్థమైందని ఖమ్మం బీఆర్ఎస్(BRS) పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. వైరాలో పార్టీశ్రేణులతో సమావేశమైన ఆయన, పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి మోసపోకుండా బీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు.