Lok Sabha Election Campaign In Telangana 2024 :రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో స్పీడు పెంచాయి. విమర్శలకు ప్రతివిమర్శలు సంధిస్తూ ముందుకు పోతున్నాయి. రాష్ట్రంలో త్రిముఖపోటీ నెలకొంది.
Congress Candidates Election Campaign : కాంగ్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జీ జగదీశ్వర్ గౌడ్ నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆల్విన్‌కాలనీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో పూజలు చేసి ఎల్లమ్మబండ, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.
నిజామాబాద్ పాత కలెక్టర్ మైదానంలో సోమవారం నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నట్లుగా కాంగ్రెస్నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియకు సీఎం హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. రామగుండంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
BRS Candidates Election Campaign :మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తిలక్ క్రీడా మైదానంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్యతో కలిసి ప్రచారం చేశారు. వారు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఖమ్మం పార్లమెంట్ పరిధి కారేపల్లి మండలంలో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రజల హక్కులను కాపాడేలా పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక ఉండేలా బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Polls 2024