ETV Bharat / spiritual

ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా? - DAILY HOROSCOPE IN TELUGU

నవంబర్ 28వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 1:50 AM IST

Horoscope Today November 28th 2024 : నవంబర్ 28వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఈ రోజు ఊహించని మలుపులు, ఎదురుదెబ్బలు ఉంటాయి. దైవబలంతో అన్ని సమస్యలు ఎదుర్కొని స్థిరంగా ముందుకు సాగుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కష్టాల్లో ఉన్నవారికి సాయిపడాలని ఆలోచిస్తారు. ఆ దిశగా ముందుకు సాగుతారు. మీ పరోపకార గుణం కారణంగా సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో జరిగిన కొన్ని అనుకోని ఘటనలు ఈ రోజు మీ మనశ్శాంతిని పోగొడతాయి. వృత్తిలో సమస్యలు సవాళ్లు ఎదురైనా మీ ప్రతిభతో అధిగమిస్తారు. తీవ్రమైన కృషితోనే విజయం ఉంటుందని గ్రహిస్తారు. ఆర్ధిక సమస్యలు చుట్టు ముడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించగలుతారు. దృఢ సంకల్పం, ప్రశాంత చిత్తంతో మీరు అత్యంత కఠినమైన పనులను కూడా సునాయాసంగా చక్కదిద్దగలుగుతారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ శ్రేయస్సు పట్ల దృష్టి పెట్టాలి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అంత అనుకూలం లేదు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇంటా బయటా ముఖ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశం అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. వ్యాపారంలో పెరిగిన పోటీ కారణంగా నష్టపోతారు. స్థిర సంకల్పంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారు ఈ రోజు మాట తీరు, కోపం నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సాధారణ అనారోగ్యం, బద్ధకం, ఒత్తిడి కారణంగా ఈ రోజు చికాకుతో ఉంటారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. విందు వినోదాలతో, విహార యాత్రలతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే! ముఖ్యమైన వ్యవహారాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలతో మనశ్శాంతి కరవవుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అంతర్గత కలహాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. స్వస్థానప్రాప్తి ఉంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శివ పంచాక్షరీ జపం మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో ప్రణాళికబద్ధంగా ఉండేందుకు ఎంతో కష్టపడతారు. అయితే గ్రహగతులు అనుకూల స్థితిలో లేని కారణంగా పనులు అంత ప్రభావవంతంగా సాగవు. సహనంగా ఉండటం మంచిది. శుభఫలితాలు కోసం, పురోగతి కోసం వేచి ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.