High Court Hearing On Disqualification Petition : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశికెడ్డి, కె.పి వివేకానంద్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి ట్రైబ్యునల్ హోదాలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే, కోర్టులకు సమీక్షించే అధికారం ఉందని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్లోకి ఎళ్లిపోయిన ఎమ్మెల్యేలు తెల్లం ఎంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కడియం శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని, ఆ తీర్పు వెలువడిన తరువాతే కోర్టుల జోక్యం ఉంటుందన్నారు. స్పీకర్ నిర్ణయం వెలువరించకముందే న్యాయ సమీక్షపై నిషేధం ఉందన్నారు.
ఎమ్మెల్యేల వరుస పార్టీ ఫిరాయింపులు - సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్