KTR Tweet On Seeds Shortage in Telangana : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటీ వేతలని ఎక్స్ వేదికగా నిలదీశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న విత్తన సమస్యలపై ఆయన ధ్వజమెత్తారు. అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు విత్తనాలు, కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులకు గురవుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అడిగారు.
KTR Slams CM Revanth Reddy : 'పర్యవేక్షించాల్సిన వ్యవసాయశాఖ మంత్రి ఎక్కడ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప, రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?' అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు.
చార్మినార్ చిహ్నమంటే మీకెందుకంత చిరాకు - కాకతీయ కళాతోరణం అంటే ఎందుకంత కోపం : కేటీఆర్ - KTR Tweet on CM Revanth Reddy
'సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా ?? తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా ?? గత పదేళ్లపాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ?? రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటీ కష్టాలు? ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు? దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా??' - కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
సరిపడా విత్తనాలు తెప్పించండి : బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆగం చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా సరిపడా విక్కనాల స్టాక్ తెప్పించండని కోరారు. బ్లార్ మార్కెట్కు తరలించకుండా కళ్లెం వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వచ్చింది కాటగలిసినం అంటున్న అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండని సూచించారు. రైతుల సంఘటిత శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజులు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు : కేటీఆర్ - KTR on Telangana Formation Day
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ - దేశ చరిత్రలో ఇది అసామాన్య విజయగాథ : కేటీఆర్