తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 3:59 PM IST

ETV Bharat / politics

కాంగ్రెస్​కు ఓటు అడిగే హక్కు లేదు - గ్యారంటీల అమలులో విఫలంపై ప్రజలకు క్షమాపణలు చెప్పాలి : కిషన్​ రెడ్డి - lok sabha elections 2024

Kishan Reddy on Congress Guarantees : లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. అధికారం వచ్చాక వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Kishan Reddy fires on Congress
Kishan Reddy on Congress Guarantees

గ్యారంటీల అమలులో విఫలంపై ప్రజలకు క్షమాపణలు చెప్పాలి : కిషన్​రెడ్డి

Kishan Reddy Election Campaign 2024 : నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరు రెండో స్థానంలో ఉంటారనేది ఎన్నికలు నిర్ణయిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కిషన్ ​రెడ్డి జీప్ ​యాత్ర నిర్వహించారు.

పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు కేటాయించింది : కిషన్ రెడ్డి - KISHAN REDDY ON CENTRAL FUNDS

Kishan Reddy fires on Congress : బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, ఆ పార్టీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. వంద రోజుల్లోపు ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ముగిసిందని, ఆయన ఫామ్​హౌస్​కే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు.

భూ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియాతో కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. అందుకే ప్రజలు కేసీఆర్​ను గద్దె దించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మహిళలకు రూ.2500 ఎవరికైనా ఇచ్చారా? నిరుద్యోగులకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ కరోనా కాలం నుంచి పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని, పేద ప్రజలు ఆకలితో అలమటించవద్దని మరో 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును రాహుల్ గాంధీకి పంపుతున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్​మెట్, లలితనగర్, రాంనగర్, నాగమయ్యకుంట, హరి నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, పాలమూరు బస్తీ, నెహ్రూనగర్, సూర్యనగర్ ప్రాంతాల్లో జీప్​లో పర్యటించి ప్రతి ఓటర్​ను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.


"కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ప్రజలను మోసం చేసింది. రాష్ట్రంలో బీజేపీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుంది". - కిషన్​ రెడ్డి, కేంద్రమంత్రి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ మేనిఫెస్టో : కిషన్​ రెడ్డి - Kishan Reddy on BJP Manifesto 2024

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు, అవినీతి కుంభకోణాలు : కిషన్‌ రెడ్డి - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details