Kishan Reddy Letter to CM Revanth Reddy on Bharat Mala Project : రాష్ట్రంలో భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Central Minister Kishan Reddy) సీఎం రేవంత్ రెడ్డికు లేఖ రాశారు. భారత్ మాల కింద నిర్మించే రోడ్లకు భూసేకరణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం 50 శాతం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం చేయకుండా పనులు వేగవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు.
Kishan Reddy on National Highways in Telangana: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మించిందిని కిషన్రెడ్డి గుర్తు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సామాజిక, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి దోహదపడ్డాయని వివరించారు. చాలా ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్యలు కూడా తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. ఆ విధంగానే ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తో కేంద్రానికి రోడ్లు నిర్మాణానికి వీలుగా ఉంటుందని సలహా ఇచ్చారు. దీంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత ముందుకు వెళ్తుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy on RRR Project: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలలో పనులు పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. ఈ పనులు నిర్మాణానికి ఎంత ఆర్థిక భారమైన భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఆర్ఆర్ఆర్లో ఉత్తరం వైపు భూసేకరణతో పాటు టెండర్లు కూడా పిలవాలని పేర్కొన్నారు.