Kishan Reddy Launched Poster,Website :ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్‌ను వెంటాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. బీజేపీనేత లక్ష్మణ్‌తో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో వెబ్సైట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Kishan Reddy Fires On BRS : బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ (Telangana)తల్లి బంధీ అయిందని, ఉద్యమాలతో మొదలైన బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని మంట గలిపిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నారు. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారని, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. వాటిని ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇస్తారా ఇవ్వరా? చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి
"రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు చేస్తారో? చెయ్యరో చెప్పాలి. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇల్లు లేనివారికి ఇల్లు ఇస్తాం. రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. ఎప్పుడిస్తారు? నిరుద్యోగ యువత తెలంగాణ కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేలు భృతి ఇస్తామన్నారు. ఏమైంది? వీటంన్నింటినీ ప్రశ్నిస్తున్న తెలంగాణ, డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తాం."- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు