LOK SABHA ELECTIONS 2024 : మోదీ పాలనను అన్ని విషయాలలో వ్యతిరేకించాను కాబట్టే తన బిడ్డ కవితను జైలులో పెట్టారని మాజీముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తన గళాన్ని ఆపేదిలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్‌లో బస్సు యాత్ర నిర్వహించారు. ఇందూరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసే మళ్లీ పోరాటానికి బయలుదేరాను : కేసీఆర్ - Ex CM KCR Election Campaign
మోదీ పాలన వల్ల తెలంగాణకు ఏమైనా మేలు జరిగిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు చెప్పారని, మోదీ ఇచ్చిన నినాదాల్లో ఒక్కటైనా నిజమైందా అని ఆయన నిలదీశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని మోదీ అంటే, దేశం సత్యనాశ్ అయ్యిందని దుయ్యబట్టారు. మోదీ అచ్చే దిన్ అంటే, రైతులు చచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా, సాగు ఖర్చులు రెట్టింపు అయ్యాయని దుయ్యబట్టారు.
ఇక్కడి ఎంపీ అర్వింద్ గురించి అందరికి తెలిసిందేనని, కేసీఆర్ మండిపడ్డారు. పసుపు బోర్డు పెడతానంటూ బాండ్ పేపర్ ఇచ్చి ఇంతవరకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, ప్రజలు సమస్యలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీజేపీకి 400 సీట్లనేది ఉత్తమాటలేనని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలదే బలం అని, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.
అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో నిజాంసాగర్ ప్రాజెక్టును ఎడారి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు కోతలు లేవని, రేవంత్ రాగానే కోతలు మొదలయ్యాయని తెలిపారు. వరి పంటకు రూ. 500 బోనస్ బోగస్ అయ్యిందన్నారు. ఐదు నెలల పాలనలో స్కాలర్‌షిప్‌లు, కేసీఆర్ కిట్లు, సీఎంఆర్ఎఫ్‌లు ఆపేశారని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు.
తాను రోడ్డెక్కగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ప్రారంభించారని కేసీఆర్ పేర్కొన్నారు. గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ మెడలు వంచుతామన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలన్నీ అమలవుతాయని, రుణమాఫీ కోసం పోరాటం చేస్తామన్నారు. రేవంత్ చేసేది దేవుళ్ల మీద ఒట్లు, కేసీఆర్‌పై తిట్లని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుందని, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు.
"కాంగ్రెస్ అయిదు నెలల పాలనలో రాష్ట్రం ఆగమయ్యింది. ఇంకా అయిదు సంవత్సరాలు ఎలా పాలిస్తారు. నేను రోడెక్కగానే రైతుబంధు నిధులు విడుదలయ్యాయి. మిగిలిన హామీల కోసం పోరాటం చేస్తాను".- కేసీఆర్, మాజీ సీఎం
మోదీ పాలనను వ్యతిరేకించినందుకే కవితను జైలులో పెట్టారు : కేసీఆర్ (etv bharat) అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా, మధ్యలో వచ్చినా బీఆర్ఎస్దే గెలుపు : కేసీఆర్ - BRS Public Meeting at Huzurabad
పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ : కేసీఆర్ - kcr bus yatra in manchiryala