Karimnagar BRS Leaders Joining In Congress :లోక్‌సభ ఎన్నికల వేళ కరీంనగర్ బీఆర్ఎస్లో ముసలం ఏర్పడింది. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటంతో జిల్లాలో పార్టీకి పెద్దిదిక్కుగా భావించే వినోద్‌కుమార్ అసహనానికి గురవుతున్నారు. ఒకప్పుడు జిల్లా నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడినప్పుడు వాటిని చక్కదిద్దే బాధ్యతను వినోద్ కుమార్ భుజాన వేసుకునేవారు. సెగ్మెంట్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నేతలకు పెద్దన్నలా ఉండే ఆయన నేడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
బీఆర్ఎస్ నాయకుల మధ్య అగాధం ఏర్పడి వర్గాలుగా విడిపోయిన వారంతా వినోద్ కుమార్‌తో మాత్రం సాన్నిహిత్యంగా మెదిలేవారు. 2018 ఎన్నికల తరువాత క్యాబినెట్ కూర్పు విషయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మెప్పించి ఓప్పించే బాధ్యత కూడా ఆయనపైనే పడింది. వేములవాడలో అభ్యర్థి మార్పు విషయంతో పాటు సిరిసిల్లకు సంబంధించిన వ్యవహారాలపై కూడా ఆయన చొరవ చూపించాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీకి అనుకూల వాతావరణం లేకుండాపోయింది.
Political Heat In Karimnagar Politics : స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీశ్రేణులు ఒక్కొక్కరుగా హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో ఎంపీగా ఓడిపోయినా అధినేత కేసీఆర్ ఆయనపై విశ్వాసంతో కరీంనగర్లో మరో అభ్యర్థి ఆలోచనే చేయలేదు. సిరిసిల్లలో బీఆర్ఎస్కు చెందిన పలువురు కార్పోరేటర్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో వలసలు ప్రారంభమయ్యాయనే ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలవేళ వేళ కరీంనగర్‌కి చెందిన కార్పోరేటర్లతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.