ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే- జాబితా ప్రకటించిన పవన్ - Janasena Party Star Campaigners

Janasena Party Star Campaigners: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న జనసేన స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ప్రకటించింది. తన సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు మరో ఆరుగురిని స్టార్ క్యాంపెనర్లుగా నియమిస్తూ జనసేనాని పవన్ ప్రకటన విడుదల చేశారు.

Janasena_Party_Star_Campaigners
Janasena_Party_Star_Campaigners

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 11:03 AM IST

జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే- జాబితా ప్రకటించిన పవన్

Janasena Party Star Campaigners: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. క్షణం తీరిక లేకుండా పార్టీల అధినేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. బుధవారం ఒకే వేదికపై మూడు పార్టీల అధినేతలు మెరిసి పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజం రేకిత్తించారు.

గెలుపు కోసం వైసీపీ కుయుక్తులు- ఓట్లు తమకే వేయించాలని తాయిలాల ఎర - YSRCP Distribute Gifts to MEPMA RPs

గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ నేతలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలకు జనసేన పార్టీ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లను బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు, నృత్య దర్శకుడు జానీ, నటుడు సాగర్, హాస్య నటులు పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేస్తారని తెలిపారు. నాగబాబు ఇప్పటికే జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాయుడు గతంలో వైసీపీలో కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు. అందులో ఇమడలేక రాజీనామా చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఆయన సేవల్ని ప్రచారం కోసం వినియోగించుకోవాలని పవన్ నిర్ణయించారు.

తిరుపతిలో మళ్లీ దొంగ ఓట్ల అలజడి- 38,493 నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించిన ప్రతిపక్షాలు - Mistakes in Tirupathi Voter List

నృత్య దర్శకుడు జానీ మాస్టర్, హాస్య నటులు పృధ్వీ రెండు నెలల క్రితం జనసేనలో చేరారు. వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇద్దరూ పవన్ అభిమానులు. గత ఎన్నికల్లోనూ జనసేన తరపున వీరు ప్రచారం చేశారు. దీంతో ఈ సారి వీరిద్దరిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు.

మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికలనిర్వహణ కమిటీ:మరోవైపు మచిలీపట్నం పార్లమెంట్ఎన్నికలనిర్వహణ కమిటీని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కార్యదర్శిగా బండి రామకృష్ణ , అక్కల రామ్మోహన రావు (గాంధీ), పంచకర్ల సందీప్, బోనీ పార్వతి, చిలకలపూడి పాపారావు, బాడిత శంకర్, అజయ్ వర్మ ఠాకూర్ సభ్యులుగా కొనసాగుతారని పవన్ వెల్లడించారు.

ఒకే వేదికపై మెరిసిన మూడు పార్టీల అధ్యక్షులు - వైసీపీ వైఫల్యాలపై ఎండగట్టిన నేతలు - TDP Janasena BJP Public Meeting

ABOUT THE AUTHOR

...view details