ETV Bharat / politics

పీఎం సూర్యఘర్ పథకానికి కేరాఫ్ అడ్రెస్ కుప్పం: మంత్రి గొట్టిపాటి - MINISTER GOTTIPATI ON PM SURYA GHAR

పీఎం సూర్యఘర్ పథకం - పైలట్‌ ప్రాజెక్టు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని ఎంచుకుని ప్రారంభించామని మంత్రి గొట్టిపాటి స్పష్టం

Minister_Gottipati_on_PM_Surya_Ghar
Minister_Gottipati_on_PM_Surya_Ghar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 5:45 PM IST

Minister Gottipati on PM Surya Ghar Scheme: పీఎం సూర్యఘర్ పథకానికి కుప్పం నియోజకవర్గం కేరాఫ్ అడ్రెస్​గా నిలువనుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. కుప్పంలో 53,314 విద్యుత్ కనెక్షన్లు త్వరలోనే సౌర విద్యుత్​తో అనుసంధానం కానున్నాయని తెలిపారు. సుమారు 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. ఒక నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహ విద్యుత్ కనెక్షన్లను సౌర వ్యవస్థతో అనుసంధానించడం ఇదే తొలిసారి అని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని ఎంచుకుని ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.

పీఎం సూర్యఘర్ ద్వారా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చునని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్​ను అనుసంధానం చేయవచ్చునని వివరించారు. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్​ను డిస్కంలకు అమ్ముకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఇంటిని ఓ విద్యుదుత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు ముందడుగు వేస్తున్నారని అన్నారు.

ఈ పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేస్తోందని మంత్రి గొట్టిపాటి వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఎం సూర్యఘర్​ను వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందని మండిపడ్డారు. పీఎం సూర్యఘర్​లో తాము చేరడం లేదంటూ జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని అన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగానికి జగన్ పాలన ఒక గొడ్డలి పెట్టు అని దుయ్యబట్టారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగానికి చంద్రబాబు పరిపాలన స్వర్ణయుగమని మంత్రి గొట్టిపాటి కొనియడారు.

ఇంటి నిర్మాణానికి ఎదురుచూడాల్సిన అవసరం లేదు - ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ

మంత్రి నారా లోకేశ్ సాయం - మరో మహిళకు ఆ నరకం నుంచి విముక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.