SIT On Vallabhaneni Vamshi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ మైనింగ్, భూకబ్జాలు తదితర వ్యవహారాలపై నలుగురితో సిట్ ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్‌లకు సిట్‌లో చోటు కల్పించింది. అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయలమేర నష్టం వాటిల్లినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిట్‌కు సూచించింది.
వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ - ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
మూడు రోజుల పోలీసు కస్టడీకి వల్లభనేని వంశీ - జైలులో బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశం