Central Good News For AP Mirchi Farmers : రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మిర్చి ధరపై ఇటీవల కేంద్రమంత్రితో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అంతకుముందు పలుమార్లు చంద్రబాబు లేఖలు రాశారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద మిర్చికి ధరను ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తద్వారా 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ఉత్తర్వులు తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెలపాటు అమల్లో ఉండనున్నాయి. 2024-2025 సీజన్‌లో పండిన పంటకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది. ఇందుకోసం ధరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.