Nellore Railway Station Works : సరికొత్త హంగులతో నెల్లూరు రైల్వేస్టేషన్ ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో మరో మూడు నెలల్లో స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. 50 సంవత్సరాల నాటి గదులు, ముందు భాగం పూర్తిగా మారిపోయి ప్యాలెస్‌ను తలపించనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌లో ఇక నుంచి ప్రయాణికులకు చక్కటి వాతావరణం ఏర్పాటు కానుంది. త్వరలో ఆవరణ మొత్తం పచ్చదనంతో ప్రత్యేక ఆకర్షణగా ప్రయాణికులకు కనువిందు చేయనుంది.
రాష్ట్రంలోని ప్రధానమైన రైల్వేస్టేషన్‌లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయి. పచ్చదనం, గోడలకు అందమైన బొమ్మలు, నాలుగు ఫ్లాట్‌ఫాంలపై మొక్కలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో గ్రీన్ రైల్వేస్టేషన్‌గా మారనుంది. వర్షపు నీటిని ఒడిసి పట్టి ప్రయాణికులకు శుద్ధి చేసిన నీటిని అందించే అధునాతన ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో కాంతి వెలుగుల్లో రైల్వేస్టేషన్ కనిపించనుంది.
"కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు స్టేషన్లో చాలా వసతులు మెరుగయ్యాయి. సరికొత్త టిక్కెట్ కౌంటర్లు, వెయింటిగ్ హాల్స్, ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దవారికి వీల్చైర్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం సంతోషం. పనులు పూర్తయితే నెల్లూరు రైల్వేస్టేషన్‌కి ఓ లుక్ వస్తోంది. పనులు త్వరతగతిన పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నాం." - ప్రయాణికులు
సరికొత్త టిక్కెట్ కౌంటర్లు, వెయింటిగ్ హాల్స్, ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ టన్నెల్‌ను అద్భుతంగా నిర్మించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో నిర్మాణం జరుగుతుంది. ప్యాలెస్‌ను తలపించేలా రైల్వేస్టేషన్ ముఖద్వారం, మొదటి అంతస్తులో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. మూడు నెలల్లో స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఇక్కడ 130కి పైగా రైళ్లు నిలుస్తాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటోంది. మరోవైపు ఉప్పుసత్యాగ్రహం జరిగినప్పుడు మహాత్మాగాంధీ ఇక్కడికి వచ్చారు. ఆప్పటి జ్ఞాపకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సింహాచలం రైల్వేస్టేషన్‌కు నిధులు - సాకారమవుతున్న ఎన్నో ఏళ్ల కల
ఈట్ రైట్ బెస్ట్ స్టేషన్ బెజవాడ - ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కించుకున్న రైల్వేస్టేషన్