ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్రంలో గంజాయి కేసులు విశాఖలోనే ఎక్కువ: హోంమంత్రి అనిత - Home Minister Central Jail Visit - HOME MINISTER CENTRAL JAIL VISIT

Home Minister Anitha Visit Rajahmundry Central Jail: రాష్ట్ర వ్యాప్తంగా 1700 గంజాయి కేసులుంటే విశాఖలోనే వెయ్యి వరకు ఉన్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని అనిత పరిశీలించారు. ఖైదీలు, జైళ్ల సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైళ్ల సిబ్బంది, ఫైర్‌ సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్షమాభిక్ష కావాలని చాలామంది ఖైదీలు అడిగారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా వైఎస్ జగన్​కు భద్రత తగ్గించలేదని మరోసారి స్పష్టం చేశారు.

Home Minister Anitha
Home Minister Anitha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 6:01 PM IST

Home Minister Anitha Visit Rajahmundry Central Jail: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్​కు మాజీ సీఎం స్థాయిలో భద్రత కల్పించామని, ఆయనకు భద్రత తగ్గించామని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ భద్రత అంశంపై ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని, జనంలోకి వస్తే తంతారని భయమా అని ప్రశ్నించారు.

రాజమహేంద్రవరంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్​పీసీఎల్ పెట్రోల్ బంక్​ను అనిత ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. జైలు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్, బాక్స్ క్రికెట్​లను అనిత ప్రారంభించారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు ఖైదీలు జీవితాంతం శిక్ష అనుభవించడం బాధ కలిగించిందని అన్నారు.

అలాగే తమ అధినేత చంద్రబాబునాయుడిని అకారణంగా రాజమండ్రి సెంట్రల్​ జైలులోని స్నేహ బ్యారక్​లో ఉంచారని, స్నేహ బ్యారక్ సందర్శించినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. తప్పుచేయనివాళ్లు జైలుకు వెళ్లే పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష అంశం వదిలేసిందని మండిపడ్డారు.

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

క్షమాభిక్షపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం:క్షమాభిక్ష కావాలని చాలామంది ఖైదీలు అడిగారని, తాము ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటీవల విశాఖ కేంద్ర కారాగారాన్ని పరిశీలించామని, ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని పరిశీలించామని తెలిపారు. జైళ్లలో పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

విశాఖలోనే ఎక్కువ కేసులు: విశాఖతో పోలిస్తే రాజమండ్రిలో తక్కువగానే గంజాయి కేసులు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 కేసులుంటే విశాఖలోనే వెయ్యి వరకు ఉన్నాయన్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 1,250 మంది ఖైదీలున్నారని, రాజమండ్రిలోని ఖైదీల్లో 376 మంది గంజాయి కేసుల్లో నిందితులే అని అన్నారు. విశాఖ జైలులో వెయ్యిమందికి పైగా గంజాయి కేసు నిందితుల ఉన్నారన్నారు.

సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తాం: బ్రిటీష్‌ కాలంనాటి ముందు కట్టిన కారాగారాలు ఇవి అని, జైలులోని గోడ కూలిపోయే దశలో ఉందని తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించామన్నారు. మహిళా కారాగారాన్ని కూడా పరిశీలించామన్న అనిత, ఖైదీలు, జైళ్ల సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నామని వెల్లడించారు. పోలీసు సిబ్బందితో సమానంగా ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారని, జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

జైళ్ల సిబ్బంది, ఫైర్‌ సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామన్న హోంమంత్రి హామీ ఇచ్చారు. సెంట్రల్ జైళ్లలో డిఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అదే విధంగా సైకియాట్రిస్ట్‌ను నియమిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఎలాంటి ఘటనలైనా నిందితుల్ని వారంలోగా పట్టుకుంటున్నామన్నారు. హోం మంత్రితో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, తదితరులు పాల్గొన్నారు.

జగన్​కు ఆ విషయం కూడా తెలియదా? : హోంమంత్రి అనిత - Home Minister on Jagan Security

HOME MINISTER ANITHA COMMENTS: గత ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి కుంటుపడి సంక్షేమం నామరూపాలు లేకుండా పోయిందని హోంమంత్రి అనిత విమర్శించారు. పోలీస్ వెల్ఫేర్ కూడా తమ ప్రభుత్వ అజెండాలో భాగమని వారి అభివృద్ధికి పార్టీ కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. గత ప్రభుత్వంలో పోలీసులతో పరదాలు కట్టించడం, చెట్టుకొమ్మలు కొట్టించడం, కాపలా కాయించడంతో సరిపెట్టారు కానీ వారి సంక్షేమం మరిచారన్నారు.

రాష్ట్రంలో సుమారు 20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు త్వరలో చర్యలు తీసుకొనున్నట్లు ఆమె తెలిపారు. అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్లతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలను, ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా ప్రాజెక్టులను పూర్తి చేయడం, చిన్నపాటి రోడ్లను సైతం మరమ్మతులు చేపట్టడం చేస్తోందన్నారు.

ఏలూరు, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారని, అటువంటి ప్రాంతాల్లో పకడ్బందీగా పోలీస్ పహార నిర్వహించి ప్రజలకు రక్షణగా నిలవనున్నట్లు ఆమె తెలిపారు.

జగన్ హయాంలో గంజాయికి బానిసై 1745 మంది ఆత్మహత్య చేసుకున్నారు- హోం మంత్రి అనిత - Home Minister Anita on Ganja

ABOUT THE AUTHOR

...view details