Minister Kollu Ravindra Fire on Perni Nani : వైఎస్సార్సీపీ నేత పేర్ని నానికి నిద్ర లేని రాత్రులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేదల బియ్యం తినేసి ఇప్పుడు ఆయన నీతి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గిడ్డంగి ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా? ఆమె పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. చోరీ చేసి డబ్బు తిరిగిచ్చేస్తే దొర అయిపోరని దొంగ దొంగే అని అన్నారు పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఈ బియ్యం కుంభకోణానికి సూత్రదారి పాత్రధారి పేర్ని నాని అని ఆరోపించారు. పేర్ని నాని తల కిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామని తెలిపారు. పోర్టు సమీపంలోని ప్రజల భూములను లాక్కోవడం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఆ విషయం నానీకి తెలియదా? : పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని, కుట్రలు చేయాల్సిన పని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని కుటుంబానికి సంబంధించి గోదాముల్లో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలిందని చెప్పారు. తప్పు జరిగిందని నాని మూడుసార్లు లేఖ రాశారని, తప్పు జరగటం వల్లే కోటి 70 లక్షల పెనాల్టీ కట్టారని అన్నారని గుర్తు చేశారు. గిడ్డంగి ఎవరి పేరు ఉంటే వారి పేరే కేసు నమోదు అవుతుందన్న విషయం నానీకి తెలియదా ? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో విచారణ పకడ్బందీగా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పీడీఎస్ రైస్ మాయం -పేర్ని నానిపై పోలీసులకు ఫిర్యాదు
రేషన్ బియ్యం పేరిట దోపిడీ : రేషన్ బియ్యం వ్యవహారంలో పేర్ని నాని సరెండర్ కావాలని తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన కుటుంబంపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. పేదల బియ్యంతో దోచుకున్న పేర్ని నానికి ఇవాళ కుటుంబం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం గోడౌన్ పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉందన్నారు. రేషన్ బియ్యం పేరిట దోపిడీ చేసిన పేర్ని నాని కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అల్లుకున్న ఆ స్నేహబంధం ఏమిటో! - చర్యలు తీసుకోవడంలో మౌనం ఎందుకో?