AP NEW CHIEF SECRETARY VIJAYANAND : ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన మధ్యాహ్నం నుంచి ఆయన సీఎస్ గా బాధ్యతలు చేపడతారని ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ విజయానంద్ పదవీ కాలం వచ్చే సంత్సరం నవంబరు వరకు ఉంది.
నీరభ్ కుమార్ పదవీ విరమణ : ఈ నెల 31 తేదీ మధ్యాహ్నం ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 7న సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీ కాలం ఈ నెల 31తోనే ముగిసింది.