Anantapur Police Arrest Dhar Gang from Madhya Pradesh : దేశంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ధార్ గ్యాంగ్’ను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 18 రోజుల క్రింత అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ చేసింది ధార్ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఈ ముఠా కోసం జల్లెడపట్టి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లోని ముగ్గురు మాత్రమే పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి రూ.90లక్షల విలువ చేసే బంగారం, వజ్రాల ఆభరణాలు, రూ.19.35లక్షల నగదుతో పాటు మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్ : అరెస్ట్ అయిన వారిలో గ్యాంగ్ లీడర్ నారూ పచావార్ కూడా ఉన్నారు. వీరిపై ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దక్షిణ భారత దేశంలోనే ఈ గ్యాంగ్‌పై 32కు పైగా కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని పగలు రెక్కీ చేసి రాత్రి పూట ఈ ముఠా చోరీలకు పాల్పడుతుందని జిల్లా వెల్లడించారు. చోరీ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌లపై వీరు సంచరిస్తుంటారని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు వీరికోసం గాలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జగదీశ్ చెప్పారు.
సీసీ కెమెరాల నుంచి తప్పించుకున్నాడు - టాటూతో దొరికేశాడు!
బైక్‌పై వచ్చి ATM వ్యాన్‌లో డబ్బులు చోరీ- సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు- ఒకరు మృతి