NELLORE DAGADARTHI AIRPORT WORKS: నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని మంత్రులు వెల్లడించారు. నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా మంత్రులు ఫరూక్, నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశ వివరాలను మంత్రి నారాయణ తెలియజేశారు.
నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయం నిర్మాణంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడామని తెలిపారు. రన్ వే ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని కేంద్ర మంత్రి తెలిపారని చెప్పారు. బిట్రగుంట రైల్వేకి సంబంధించిన నిరుపయోగంగా ఉన్న 950 ఎకరాల స్థలంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం మంత్రి నారాయణ రామలింగాపురం ఫ్లై ఓవర్‌పై చిత్రీకరించిన పెయింటింగ్‌లను పరిశీలించారు.
నెల్లూరు ఎయిర్‌పోర్టును 2014-19 సమయంలో మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ పనులను ప్రారంభించలేదని, దానిని రద్దు కూడా చేసిందని మండిపడ్డారు. ఎయిర్‌పోర్టు కోసం 750 ఎకరాలను అప్పట్లోనే భూ సేకరణ చేశామని వెల్లడించారు. దాని విషయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని నాలుగైదు సార్లు కలిశానని అన్నారు. ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడానని పేర్కొన్నారు. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రానికి ఒక కమిటీని పంపిస్తామని అన్నారని మంత్రి నారాయణ చెప్పారు. అదే విధంగా వీలైనంత త్వరగా మంజూరు చేస్తామని చెప్పారని అన్నారు. దీనికి అవసరమైన మిగిలిని భూమిని సైతం సేకరించి, ఎయిర్‌పోర్టు పనులను ముందుకు తీసుకుపోతామని మంత్రి నారాయణ వెల్లడించారు.
"దగదర్తి విమానాశ్రయం పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కోరాం. ఇప్పటికే ఆయతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రానికి కమిటీని పంపిస్తామన్నారు. ఇంకా దానికి అవసరమైన భూమిని సేకరించి పనులు ప్రారంభిస్తాము. బిట్రగుంటలో 950 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తాం". - నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి
భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరో 500 ఎకరాలు - మంత్రుల కమిటీ ఏర్పాటు
ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీ సర్వే పూర్తి - మారనున్న ఆ ఏడు ప్రాంతాల రూపురేఖలు