ETV Bharat / offbeat

ప్రాణాలకు తెగిస్తేనే 'డేరియన్ గ్యాప్' దాటేది - అమెరికా అక్రమ వలసల మార్గమిదే! - DARIAN GAP

అత్యంత భయంకరమైన ప్రాంతం - అమెజాన్ అడవి, అడుగడుగునా దాడులు తప్పించుకుంటేనే!

deportation_of_illegal_immigrants
deportation_of_illegal_immigrants (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 7:32 PM IST

DARIAN GAP : ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, తక్కువ పనిగంటలు, ఎక్కువ వేతనం! లక్ష్యం ఏదైనా సరే అమెరికా వెళ్లాలన్న ఆలోచనకు బీజం పడుతోందిక్కడే. మన దేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీసా వస్తే సరే, లేదంటే అగ్రరాజ్యంలో అడుగు పెట్టేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధి కోసం కొందరు, శరణార్థులుగా మరికొందరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఒకటైన 'డేరియన్‌ గ్యాప్‌' మీదుగా వెళ్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

LIC 'అన్‌క్లెయిమ్డ్‌ మనీ' రూ.800కోట్లు - మీ డబ్బు కూడా ఉందేమో చెక్‌ చేసుకోండిలా!

అసలు డేరియన్ గ్యాప్ అంటే ఏంటి? ఆ ప్రాంతం అంత ప్రమాదకరమా? అంటే అడుగడుగునా ప్రమాదమే అని తెలుస్తోంది. మృత్యువు ఒడిలో ప్రయాణమే అని పలువురి అనుభవాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి పాన్-అమెరికన్ హైవే పొడవు 30వేల కిలోమీటర్లు 14 దేశాల మీదుగా వెళ్లే ఈ రహదారికి ఒకే దగ్గర 160 కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే "డేరియన్ గ్యాప్" అని పిలుస్తుండగా అదంతా అండీస్ పర్వతాలు, అమెజాన్ అటవీ ప్రాంతం. ఇక్కడ అటవీ జాతి ప్రజలు, వేటాడే ప్రజలతో పాటు వివిధ సంస్కృతులు కలిగిన ఎన్నో జాతులు నివసిస్తుంటాయి. చిత్తడి నేలలతో పాటు, అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు, అటవీ మృగాలున్న ఈ ప్రాంతం మీదుగా అమెరికాకు అక్రమంగా వలస వెళ్తుంటారు.

ఎక్కడుందీ డేరియన్‌ గ్యాప్‌?

కొలంబియా - పనామా మధ్య డేరియన్ గ్యాప్ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూరమృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణమే.చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు మాదకద్రవ్యాల వ్యాపారంతో పాటు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతుంటాయి. ఈ క్రమంలో వలసదారులను దోచుకోవడంతో పాటు వారి ప్రాణాలకు హాని తలపెడుతుంటాయి.

15 రోజుల సాహసం

ఎలాగైనా సరే అమెరికా వెళ్లాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని మానవ అక్రమ రవాణా ముఠాలు డేరియన్‌ గ్యాప్‌ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. దీన్ని దాటేందుకు దాదాపు 15రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే అమెరికా దేశాలైనా పనామా, కోస్టారికా, ఎల్‌ సాల్వడార్‌, గ్వాటెమాకు తరలించి అక్కడి నుంచి మెక్సికో, అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో అననుకూల వాతావరణం, అనారోగ్యం, దాడుల కారణంగా అనేకమంది దారిలో ప్రాణాలు కోల్పోయి అనాథ శవాల్లాగా అడవిలోనే కనుమరుగవుతుంటారు. మహిళలపై డ్రగ్స్‌ ముఠాల అఘాయిత్యాలకు అంతే ఉండదు. ఎదిరిస్తే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.

ఏడాదిలో 5.2లక్షల మంది

కొన్ని దశాబ్దాల కిందట డేరియన్ గ్యాప్ మీదుగా అమెరికాలోకి వెళ్లే వారి సంఖ్య వేలల్లో ఉండగా ప్రస్తుతం ఏటా లక్షలాది మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క 2023 సంవత్సరంలోనే దాదాపు 5.2లక్షల మంది డేరియన్ గ్యాప్ మీదుగా అమెరికాలోకి ప్రవేశించగా గతేడాది కఠిన నిఘా ఫలితంగా ఈ సంఖ్య 3లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇండియా, వెనెజువెలా, హైతీ, ఈక్వెడార్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశీయులు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. 2015-19 మధ్యకాలంలో 312 మంది, 2021-23లో 229 చనిపోవడం లేదా అదృశ్యమైనట్లు అంచనా. 2023లో 676 మందిని లైంగిక దాడి బాధితులుగా గుర్తించగా, గతేడాది ఈ కేసులు 233గా నమోదయ్యాయి.

చివరకు అమెరికా చేరినా

నిత్యం వేలాదిమంది అభాగ్యులు ప్రాణాలకు తెగించి డేరియన్ గ్యాప్ మార్గంలో అమెరికా చేరినా అక్కడా కష్టాలు తప్పడం లేదు. చివరకు మెక్సికో దాటినా అమెరికా దళాల చేతికి చిక్కి జైళ్లలో మగ్గుతుంటారు. తాజాగా అక్రమ మార్గంలో అమెరికా వెళ్లిన వారినే తిరిగి స్వదేశాలకు పంపుతున్నారు. అతి కొద్ది మందికే శరణార్థుల కింద అగ్రరాజ్యం ఆశ్రయం కల్పిస్తోంది.

ఇండియన్​ ఆర్మీలోకి రోబోలు - ఇవి బాంబులకు బెదరవు, బుల్లెట్లకు భయపడవు!

రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.