ETV Bharat / state

పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ రిప్లై - ఆరు పేజీల లేఖలో ఏముందంటే! - SANDHYA THEATER REPLY TO POLICE

తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చిన థియేటర్‌ యాజమాన్యం - 4, 5 తేదీల్లో సినిమా థియేటర్‌ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్‌ తీసుకుందని వెల్లడి

Sandhya Theater Management Responds to Police Notice
Sandhya Theater Management Responds to Police Notice (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2024, 10:30 PM IST

Sandhya Theater Management Responds to Police Notice : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్‌ మేనేజ్​మెంట్​కు పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఆ థియేటర్‌ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని ఆరు పేజీల లేఖను పోలీసులకు సమాధానంగా పంపింది.

డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్‌ షోకు 80 మంది థియేటర్‌ సిబ్బంది విధుల్లో ఉన్నారని పోలీసులకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. డిసెంబరు 4, 5న సినిమా థియేటర్‌ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్‌ తీసుకుందని వెల్లడించింది. సినిమాల రిలీజ్​లకు గతంలోనూ హీరోలు థియేటర్​నకు వచ్చినట్లుగా వివరించింది. సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్‌ ఉందని సంధ్య థియేటర్​ యాజమాన్యం వివరించింది. ఈ మేరకు ఈ వివరాలన్నింటితో కూడిన 6 పేజీల లేఖను యాజమాన్యం పోలీసులకు పంపింది.

చిక్కడపల్లి పీఎస్‌లో ముగిసిన అల్లు అర్జున్‌ విచారణ - ఆ అంశాలపై ఆరా

ఇంతకీ ఏం జరిగిందంటే? : డిసెంబరు 4వ తేదీన సంధ్య థియేటర్‌ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. బాధిత కుటుంబానికి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్‌ 50లక్షల రూపాయలు, హీరో అల్లు అర్జున్‌ రూ.కోటి, దర్శకుడు సుకుమార్​ రూ.50లక్షలను, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.

మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడిన విషయం తెలిసందే. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరగా నాంపల్లి కోర్టు విచారణను డిసెంబరు 30కి వాయిదా వేసింది. సంధ్య థియేటర్‌ ఘటనలో ఇటీవల అల్లు అర్జన్​ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విధితమే. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.

నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్‌ ముగియడంతో అల్లు అర్జున్ వర్చువల్‌గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు నాంపల్లి కోర్టు వెల్లడించింది. అల్లు అర్జున్‌ రిమాండ్‌పై కూడా విచారణ ఆ రోజే జరగనుంది.

'అల్లు అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలే -​ రూ.10 లక్షల డీడీలు మాత్రమే పంపారు'

సంధ్య థియేటర్‌ ప్రమాదం దురదృష్టకరం - నా క్యారెక్టర్‌ను కించపరిచారు: అల్లు అర్జున్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.