Heated Discussion In Telangana Assembly : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదంటూ విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. సమాచారం లేకుండానే ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విమర్శించాయి. శాసనసభ రూల్స్ ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.
శాసనసభ నడిపే తీరు ఇది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సభ్యులకు సమాచారం లేకుండా ఎలా మాట్లాడతారని బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విపక్ష, అధికార పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది.
Sridhar Babu Fires On BRS :మరోవైపు విపక్ష సభ్యుల విమర్శలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. సభ నిర్వహణలో కొంత సమాచార లోపం జరిగిందన్న శ్రీధర్ బాబు దీనికే స్పీకర్ సారీ చెబుతారా? అని మండిపడ్డారు. స్పీకర్ ఆఫీస్ తీసుకునేటువంటి నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిందేనని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. విపక్షాల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.